Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

యువకుని ఆత్మహత్యాయత్నం

death

మనతెలంగాణ/బెల్లంపల్లిః  పట్టణం ఆర్‌టిసి బస్టాండ్ వద్ద పాత బెల్లంపల్లికి చెందిన ఈర్ల నగేష్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అతని సోదరి తెలిపిన వివరాల ప్రకారం… గత కొద్ది రోజుల క్రితం భార్యతో వారి ఇంటి వద్ద భార్యతో గొడవ జరిగిందని, రెండు రోజుల క్రితం ఆమె తన కుమార్తెను తీసుకొని వారి తల్లిగారింటికి వెల్లిందని ఆమె తెలిపారు. మనస్తాపానికి గురైన సోదరుడు కొత్త బస్టాండ్ వద్ద పురుగుల మందు తాగానని, తన కోసం ఎవరు వెతకరాదని ఫోన్ చేయగా తాను అక్కడికి వెళ్లి స్థానికుల సాయంతో 108 వాహనం ద్వారా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భాధితున్ని పరిశీలించిన వైద్యులు చికిత్స చేస్తున్నారు.

Comments

comments