Search
Wednesday 23 May 2018
  • :
  • :

అభివృద్ధి పనులపై అలసత్వం వహిస్తే చర్యలు

abhivrudi

మన తెలంగాణ/తొర్రూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మంజూరుచేసిన పథకా ల పట్ల అలసత్వం వహిస్తే అధికారులైన, ప్రజాప్రతినిధులైన ఒక్కటేనని, వారిపై కఠినచర్యలు తప్పవని పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. మంగళవా రం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో తొర్రూరు, పెద్దవంగర మండలాల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీ క్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూం మంజూరుచేసిందని, వాటి నిర్మాణంలో స్థానిక అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్లక్షం వహిస్తున్నారని, రెండు మండలాలకు కలిపి సుమారు 500గృహాలు మం జూరైతే ఇందులో సగం కూడా పూర్తికాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించకుంటే తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించా రు. అదేకాకుండా ప్రతి గ్రామానికి ఈజిఎస్ పథ కం ద్వారా శ్మశానవాటిక, డపింగ్‌యార్డు, జిపి భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం చేస్తున్నారన్నారు. ఎవ్వరూ పనిచేయకున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. మహబూబాబాద్ జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను అందించడానికి అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నా రు. అధికారులు ప్రజల అవసరాలను తీర్చడంలో ముందుండాలన్నారు. ఎవరూ నిర్లక్షం వహించి నా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించా రు. రెవెన్యూ డివిజన్ అధికారి క్రిష్ణవేణి, మండల ప్రత్యేక అధికారి గౌస్ హైదర్, తహశీల్దారు వెంకటరెడ్డి, ఎంపిపిలు కర్నె సోమయ్య, బానోతు జ్యో తి, జెడ్‌పిటిసి కమలాకర్, ఎంపిడిఒ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మండలంలోని గుర్తూరులో మంగళవా రం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలుచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ వాటర్ ట్యాంకు నిర్మాణానికి రూ.36లక్షలు, అంతర్గత సిసి రోడ్లనిర్మాణానికి రూ.80లక్షలు, శ్మశాన వా టిక నిర్మాణానికి రూ.10లక్షలు, 15మందికి గొర్రె ల పంపిణీ, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంటును ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, రైతాంగ సంక్షేమమే లక్షంగా గోదావరి జలాల తో చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదన్నారు. స్వచ్ఛమైన తాగునీరుని అందించేందుకు మిషన్ భగీరథ పనులను వేగవం తం చేశామని, పరిశుభ్రమైన గ్రామాన్ని తయారు చేసుకునేందుకు సిసి రోడ్ల నిర్మాణాలను చేపట్టామ న్నారు. ఎంపిపి కర్నె సోమయ్య, జెడ్‌పిటిసి జా టోతు కమలాకర్, ఎఎంసి చైర్మన్ నరేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాయకులు వెంకటనారాయణ గౌడ్, డాక్టర్ సోమేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Comments

comments