Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేయాలి

collectorsd

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి : జనగామ జిల్లాలో భహిరంగ మలమూత్ర రహిత జిల్లాగా తీర్చి దిద్దడానికి వివిధ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను త్వరితగతిని పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 36 గ్రామాలలో మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయని వాటిని సకాలంలో పూర్తిచేయడానికి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. గత రెండు నెలల వ్యవధిలో జిల్లాలో 1 లక్షా 8 వేల 4 వందల 73 మరుగు దొడ్లు నిర్మించామని మరో 12471 నిర్మిస్తే ఓడిఎఫ్ జిల్లా సాధించవచ్చని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి జయచంద్రారెడ్డి, డిపిఒ రవికుమార్, ఎపిడి సంపత్‌రావు, వసంత, ఎస్‌బిఎం సరిత, హెచ్‌ఆర్ కర్ణాకర్, ఎంఎఐఎస్ రాజన్న, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments

comments