Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

తాటి చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి

Toddy-Worker-Dead

మహబూబాబాద్: తాటి చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతిచెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని తొర్రురు మండలం వెలికట్ట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే వెంకటేష్ అనే గీతకార్మికుడు ఇవాళ సాయంత్రం లొట్టి కట్టేందుకు తాటి చెట్టు ఎక్కాడు. అయితే చెట్టు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు మోపు జారడంతో అమాంతంగా కిందపడిపోయాడు. ఇది గమనించి స్థానికులు వెంటనే వచ్చి చూసేసరికి వెంకటేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేష్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Toddy worker died in Mahabubabad Today.

Comments

comments