Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అంబేద్కర్‌నగర్‌లో విషాదఛాయలు

baby
మన తెలంగాణ, వైరాః
వైరా మండలం స్టేజిపినపాక వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లాడ మండలం అంబేద్కర్‌నగర్‌కు చెందిన అమర్లపూడి దామిని(5) మృతి చెందింది. అతివేగంతో మద్యం మత్తులో వస్తున్న వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని ప్రక్కనున్న దామిని మీదకు దూసుకుపోవడంతో మృతి చెందింది. బుధవారం రాత్రి నాల్గో సంవత్సరం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి వెళుతున్న దామిని పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. కాని 24గంటలు గడవక ముందే మృత్యువు రూపంలో దామిని మరణించింది. రాత్రి బర్త్‌డే సంబరాలు చేసుకున్న దామిని తండ్రి కూతురు, తల్లితో కలిసి పినపాక వద్ద ఉన్న హోటల్ వద్దకు వచ్చి టిఫిన్ తీసుకునేందుకు లోపలికి వెళ్లాడు. మోటార్ బైక్ వద్ద నిల్చొని ఉన్న తల్లి, బైక్‌పై కూర్చొని ఉన్న చిన్నారి దామిని మీదకు వ్యాన్ దూసుకొని పోవడంతో దామిని అక్కడికక్కడే మరణించింది. అమ్మమ్మ అయిన అప్పమ్మ తీవ్రంగా గాయపడింది. కళ్ళ ముందే కూతురు మరణించడం తల్లి గాయాలపాలు కావడం చూసిన కొడుకు రాజు రోధన చెప్పలేని విధంగా ప్రతిఒక్కరిని కన్నీటిని పెట్టించింది. ఎంతో సంతోషంతో కూలి పని చేసుకొని జీవనం కొనసాగించే రాజు కుటుంబ సభ్యులు తన ముద్దుల కూతురు అయిన దామిని పుట్టిన వేడుకలకు కుటుంబ సభ్యులందరిని పిలిచి సంతోషంగా కలుపుకొని తన బిడ్డ ఎప్పుడు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకున్న తండ్రి ఆశలను మృత్యువు కాటేసింది. వ్యాన్ డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనాన్ని నడపడం నిండు నూరేళు జీవించాల్సిన చిన్నారి దామిని మరణానికి కారుకుడయ్యాడు. దామిని మరణవార్త తెలిసిన అంబేద్కర్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

comments