Search
Friday 20 April 2018
  • :
  • :

విద్య, ఉపాధిపై బాలకార్మికులకు శిక్షణ

wglమనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు కింద జిల్లాలోని బాలకార్మికులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపా టు విద్యతోపాటు ఉపాధి శిక్షణ ఇచ్చే విధం గా చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాల కార్మికుల ని ర్మూలన, ఉపాధి శిక్షణా కార్యక్రమాలపై సంబంధిత శాఖాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు కింద జిల్లా ప్రాజెక్టు సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సొసైటీల ద్వా రా ప్రమాధభరిత పరిశ్రమలు, హోటళ్లు, ఇతర సంస్థల లో పనిచేస్తున్న బాల కార్మికులను, యుక్త వయస్సు కార్మికలను గుర్తించి ప్రత్యేకమైన శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యతోపాటు ఉపాధి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లాలోని బాల కార్మికులను గుర్తించడానికి జనవరి 5 నుంచి కార్పొరేషన్‌తోపాటు గ్రామీణ మండలాల్లో ప్రమాధభరిత పరిశ్రమలు, హోటళ్లు, ఇతర వాణి జ్య సంస్థలలో పనిచేస్తున్న బాల కార్మికులను డోర్‌టూడోర్ తిరిగి బేస్‌లైన్ సర్వే ద్వారా బాల కార్మికుల గణాంకాలతోపాటు వారిని గుర్తించి అనువైన ప్రదేశాలలో ప్రత్యేకమైన శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ బేస్‌లైన్ సర్వే ద్వారా జిల్లాలోని ప్రతి బాల కార్మికుడిని గుర్తించడంతోపాటు వారి మానసిక స్థితిగతులను,వయసుసను బట్టి విద్యాబుద్ధులు లేదా ఉపాధికి దోహదపడే శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మెప్మా, ఐసిడిఎస్, అదేవిధంగా గ్రామీణ మండలాల్లో డిఆర్‌డిఎ, ఐసిడిఎస్‌శాఖల ద్వారా బేస్‌లైన్ సర్వే జనవరి 5 నుంచి నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో బాల కార్మికులతో అనుసంధానమై ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేసుకొని బేస్‌లైన్ సర్వే నిర్వహించాలన్నారు. కార్మికశాఖ, పరిశ్రమలశాఖ, విద్యాశాఖ, జాతీయ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు, మహిళ శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్ , హోంశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, యువజన సర్వీసులు, పౌర సరఫరాలశాఖ, ఉపాధి కల్పినశాఖ, అదేవిధంగా జిల్లాలోని వర్కర్స్ యూనియన్ తదితర సంస్థలతో సర్వేలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు. గుర్తించిన కార్మికులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాల్లో వసతి, విద్య, భోజన సౌకర్యాలతో పాటు ఉపాధికి దోహదపడే శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ఉప కమిషనర్ రమేష్‌బాబు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ రాము, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఉషా, జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments