Search
Saturday 21 April 2018
  • :
  • :

హరిద్వార్ యోగాలో శిక్షణ

babaరాందేవ్‌బాబాతో ప్రశంసలు
మనతెలంగాణ/యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 8వ కాలనీకి చెందిన ఎలిగేటి కృష్ణ ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో యోగా శిక్షణను దిగ్విజయంగా పూ ర్తి చేసుకొని తిరిగి వచ్చారు. పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో 8రోజుల పాటు ఇట్టి శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఉమ్మడి జిల్లా నుంచి కృష్ణ ఒక్కరే ఈ శిక్షణకు ఎంపిక కా వడం విశేషం.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మంది శిక్షణ పొందినట్టు కృష్ణ తెలిపారు. శిబిరంలో పాల్గొన్న ప్రచారకులకు ఆసనాలు, ప్రాణాయమాలు, ఆక్యుపంక్చర్, జలనీతి, సూత్రనీతి లాంటి వాటిపై రాందేవ్‌బాబా శిక్షణ ఇచ్చారు. కృష్ణ గతంలో ఉమ్మడి జిల్లాలో అనారోగ్యం, రుగ్మతలను రూపుమాపడానికి తనవంతుగా 108 యోగా శిబిరాలను నిర్వహించా రు. ఐదు రోజుల శిక్షణ శిబిరాలు, 256 పాఠశాలల్లో విద్యార్థులకు యోగాపై ఆసక్తి కలిగించడమే కాకుండా ఏకాగ్రత, జ్ఙాపకశక్తి పెంపొందించడం,ఆసనాలు,ప్రాణాయామాలు నేర్పించడం జరిగింది.
స్వదేశీ ఉద్యమంలో భాగంగా 174ఆరోగ్యం సభలు నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని ఇప్పటి వర కు గ్రామాలలో 98 ర్యాలీలు నిర్వహించారు. యోగాకు విశేసం గా ప్రాధాన్యతను చేకూర్చుతున్న కృష్ణను రాందేవ్‌బాబా ప్ర త్యేకంగా శిభిరంలో అభినందించారు. హరిద్వార్‌కు చెందిన పు ష్కర్‌జీ, నవీన్‌లచే ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. యో గా శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చిన కృష్ణను ఆడెపురవీందర్, మండలసత్యం, ఆకారపు రవి, కోటమనోహర్, బా ణాపురం రంగారెడ్డిలు అభినందించారు.

Comments

comments