Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

44వ డివిజన్ ఉప ఎన్నికకు టిఆర్‌ఎస్ అభ్యర్థి సరిత నామినేషన్ దాఖలు

trs3

*రెండు రోజుల్లో రెండే నామినేషన్‌లు
*నేటితో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ
*భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన టిఆర్‌ఎస్ అభ్యర్థి

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్‌కు జరుగుతున్న ఉప ఎన్నికకు గురువారం టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా అనిశెట్టి సరిత నామినేషన్ దాఖలుచేశారు. గురువా రం ఉదయం వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు వీరగంటి రవీందర్, నల్ల స్వరూపరా ణి, కార్పొరేటర్లు మిరియాల్‌కార్ దేవేందర్, బోడ డిన్నా, మిరుదొడ్డి స్వ ప్న, కేశిరెడ్డి మాధవిరెడ్డితో కలిసి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. 27న నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కాగా బిజెపి అభ్యర్థిగా కొలను సంతోష్‌రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు అభ్యర్థి ఎవరు అనేది ఇంకా పార్టీ ప్రకటించలేదు. ఇప్పటికే టిఆర్‌ఎస్ అభ్యర్థి స్వ యంగా డిసిసి అధ్యక్షుడి ఇంటివద్దకు వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై ఆలోచనలో పడిన కాంగ్రెస్ అభ్య ర్థి విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నామినేషన్‌లు వేయడానికి శుక్రవారం చివరి రోజు కావడంతో చివరిరోజున ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిని నిలుపుతుందా లేదా టిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. అయితే బిజెపి మాత్రం ఏది ఏమైనా అభ్యర్థిని బరిలో దించుతామని గట్టిగా చెబుతున్నారు.
భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేసిన సరిత
టిఆర్‌ఎస్ అభ్యర్థి దివంగత కార్పొరేటర్ భార్య అనిశెట్టి సరిత భారీ ర్యాలీ గా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. సరితకు మద్దతుగా పెద్దఎత్తున టిఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. 44వ డివిజన్ నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఎంజిఎం సెంటర్ నుంచి ర్యాలీగా కార్పొరేషన్ వరకు చేరుకున్నారు.
ఏకగ్రీవానికి సహకరించాలి : దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ
44వ డివిజన్‌కు జరుగుతున్న ఉప ఎన్నికలో అన్ని పార్టీలు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ విజ్ఞప్తి చేశారు. సరిత నామినేషన్ అనంతరం ఆయన మర్రి యాదవరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలను కలిశామని, అన్ని పార్టీలు కూడా సానుకూలంగా స్పందించాయని ఆయన పేర్కొన్నారు. సరిత ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

comments