మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరు మండల శివారులోని దుబ్బతండా సమీపంలో ఆటో – లారీ ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వైద్యశాలకు తరలించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.