Search
Saturday 21 April 2018
  • :
  • :

విహారయాత్రలో విషాదం…

Children-Deid

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక కిన్నెరసాని కాల్వ వద్దకు విహార యాత్రకు వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు కాల్వలో పడి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే… ములకపల్లి మండలం నాగారం యుపిఎస్‌కు చెందిన నలుగురు ఉపాధ్యాయులు 70 మంది విద్యార్థులతో కలిసి ఇవాళ విహార యాత్రకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు కాలుజారి కాల్వలో పడి మృతిచెందారు. మృతులు రాజేష్, నిఖిల్ అని తెలిసింది. ఈ సంఘటనతో మృతుల కుంటుంస సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Two Students Death in Excurtion in Kinnerasani Canal.

Comments

comments