Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

గూగుల్ మ్యాప్ లో టూ వీలర్ రూట్స్…..

                      Google-Map

హైదరాబాద్ లాంటి మహానగరంలో  ఒక చోట నుంచి మరొక చోటు ప్రయాణించలంటే కొత్త వారు నానా ఇబ్బందులు పడుతుంటారు. గూగుల్ మ్యాప్ ద్వారా ఏ చోట నుంచైనా వెరొక చోటుకు సులువుగా ప్రయాణించవచ్చు. కారు,బస్సు,  సైకిల్, రోడ్డు మీద నడిచే వాళ్లకే గూగుల్ మ్యాప్ రూట్ అందుబాటులో ఉండేది కానీ ఇప్పుడు గూగుల్ సంస్థ కొత్తగా బైక్ నావిగేషన్ మోడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్ లో బైక్స్ రూట్ ను అప్ డేట్ చేసుకోండి. మీ మొబైల్ కు అప్ డేట్ కాకపోతే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.  ద్విచక్ర వాహనాదారులకు గూగుల్ సంస్థ ఈ యాప్ ను సిద్ధం చేసింది.

ద్విచక్ర వాహనం మోడ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుందంటే..

యాప్‌లో టూ వీలర్ మోడ్‌ను క్లిక్ చేయగానే  మనం ప్రయాణించే దారిని చూపిస్తుంది. అంతేకాకుండా బస్సు, కారు, ట్రక్స్ లాంటి పెద్ద వాహనాలు వెళ్లలేని షార్ట్‌కట్ మార్గాన్ని ఈ యాప్ చూపించనుంది. దీంతో పాటు ద్విచక్ర వాహనం వెళ్లే దారిలో ట్రాఫిక్ పరిస్థితేంటి, గమ్యానికి వెళ్లడానికి పట్టే సమయం కూడా ఈ యాప్‌లో చూడటానికి గూగుల్ కల్పించనుంది

ఈ యాప్‌ను నవంబర్‌‌లో రూపొందించినప్పటికీ తాజాగా కొన్ని కొత్త ఫీచర్స్‌‌ను కలిపి తాజాగా విడుదల చేసింది. ఈ యాప్‌‌లో మార్గ మధ్యలో ఉండే మ్యూజియమ్స్, కేఫ్‌‌లు, చర్చీలు ఉన్న ప్రాంతాలను చూపించడమే కాకుండా వాటి గుర్తులను  ప్రత్యేకంగా రంగులో చూపించనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. బండి వెళ్లే మార్గంలో రోడ్లు ఏమైనా మూసివేసినా, రోడ్డు పనులు జరుగుతున్నా కూడా ఈ యాప్‌‌లో చూసుకునేందుకు వీలుంటుంది.

 

Comments

comments