Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

bike
మన తెలంగాణ/గంభీరావుపేట : ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపక్కకు పడిపోవడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతిచెందిన సంఘటన గంభీరావుపేట మండలం లక్ష్మిపూర్ తండా సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన గుగులోతు దేవుసింగ్ (50) అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై లక్ష్మిపూర్ తండాలోని బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇదే సమయంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుకిందికి గుంజుకుపోవడంతో బైక్ పైనుండి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో దేవుసింగ్ అక్కికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలనికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

Comments

comments