Search
Wednesday 21 February 2018
  • :
  • :

జాబ్ రావడంలేదని యువకుడు ఆత్మహత్య

Suicide-Poision

వికారాబాద్: ఉద్యోగం రావడంలేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం వీర్‌సెట్టిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే చంద్రమోహన్ అనే యువకుడు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్న చంద్రమోహన్ ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మరో ఇద్దరు యువకులు కూడా రాష్ట్రంలో పోస్టులు భర్తీ చేయడం లేదని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే.

Unemployed Commits Suicide in Vikarabad.

Comments

comments