Search
Monday 11 December 2017
  • :
  • :

గుర్తుతెలియని వృధ్ధుని మృతి

death
మనతెలంగాణ/మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం గ్రామంలో గుర్తుతెలియని వృధ్ధుడు మృతి చెందాడు శనివారం కాళేశ్వరంలోని దేవదాయ శాఖ కార్యాలయం వెనుక వృధ్ధుని శవం స్థానికులకు కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడంతో గుర్తు తెలియని వృధ్ధుని మృతదేహంగా గుర్తించారు. ఇదిలా ఉంటే మృతుడు తెల్ల చొక్కా ధరించి ఉన్నాడుమృతుని చేతిపై పచ్చబొట్టుతో లింగయ్య అని వ్రాసి ఉంది. వృధ్ధుని మృతదేహం ప్రక్కన పురుగుల మందు డబ్బా ఉండడంతో పురుగుల మందు త్రాగి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ విశయం పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments