Search
Sunday 21 January 2018
  • :
  • :

ఫ్యాక్టరీ తెరిపించేంత వరకు రైతులకు అండగా ఉంటాం

kodanda

టిజెఎసి చైర్మన్ కోదండరాం
మనతెలంగాణ/మెట్‌పల్లి: ఎన్‌డిఎస్‌ఎల్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని గత 317 రోజులగా కాంగ్రెస్ మాజీ ఎంఎల్‌ఎ కొమిరెడ్డి రాములు ఆధ్వర్యంలో చే స్తున్న దీక్షా శిబిరాన్ని ఆదివారం టిజెఎసి చైర్మన్ కోదండరాం సందర్శించి తన సం ఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీని అతిచౌకగా అమ్మడం జరిగిందని 2004 సంవత్సరంలో సభ సంఘాన్ని ఏర్పా టు చేయడంతో ఫ్యాక్టరీ నష్టాల్లో లేదని లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని మూసివేసి అమ్మారని ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వం నడిపించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. సిఎం కెసిఆర్ నిజాంపై ఉన్న గౌరవంతో నిజాం షుగర్ ఫ్యా క్టరీని తెరిపించాలని అన్నారు. ముత్యంపేట,బోధన్,మెదక్ ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు,కార్మికులు ఒకతాటిపైకి వచ్చి గ్రామగ్రామాన రైతు కమిటీలను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లో టిజెఎసి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టి ఫ్యాక్టరీలన్నీ తెరిచే వరకు మీ వెంట ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంఎల్‌ఎ కొమిరెడ్డి రాములు మాట్లాడుతూ టిజెఎసి చైర్మన్ కొదండరాం మెట్‌పల్లికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 317వ రోజుల నుంచి చేస్తున్న దీక్షకు తన సంఘీభావం తెలపడంతోనే సిఎం కెసిఆర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిజెఎసి కోకన్వీనర్ ప్రొ. పురషోత్తం, జయవిల్, గంగారెడ్డి, గోపాల్‌శర్మ, చుక్కగంగారెడ్డి, బండ శంకర్, అబ్దుల్ ఆఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments