Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జన్మదిన వేడుకలు

vajpayee

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి 93వ జయంతి వేడుకలను భారతీయ జనతాపార్టి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా  నిర్వహించారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేపట్టారు. ఈ సందర్బంగా ఆ పార్టి కార్యవర్గ సభ్యుడు బోనగిరి సతీష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల మురళి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని, ఆయన చేసిన సేవలను ప్రతీ ఒక్క కార్యకర్త గుర్తుంచుకుని ముందుకు వెళ్లాలన్నారు. పార్టికోసం ఆయన ఎంతో కృషిచేయడంతోనే ఈ రోజు అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతీ ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టి నాయకులు చంద్రశేఖర్, సోము, వంశీ, మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments