Search
Saturday 21 April 2018
  • :
  • :

వరల్డ్ ఛాంపియన్ షిప్‌కు ఎంపికైన వంశీకృష్ణ

STND

జగిత్యాల టౌన్ : ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య హైస్కూల్‌కు చెందిన విద్యార్థి కరాటే పోటీల్లో వరల్డ్ ఛాంపియన్ షిప్‌కు ఎంపికయ్యాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బి. వంశీకృష్ణ అమెరికాలో జరగబోయే చోటా ఖాన్ కరాటే అండర్-14 విభాగంలో ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో రాణించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి, ప్రిన్సిపల్ రమ, వైస్ ప్రిన్సిపల్ టి.వి.ఎన్ చారి, పిఇటి రాంకిరణ్‌లు ఘనంగా సన్మానించారు.

Comments

comments