Search
Thursday 24 May 2018
  • :
  • :

పవన్.. ఇన్నాళ్లు టాబ్లెట్ వేసుకొని నిద్రపోయావా

                   Vasireddy-Padma

ఆంధ్రప్రదేశ్:  జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ తాను  ప్రశ్నిస్తున్నానంటూ కొత్తగా తెరపైకి వచ్చినట్టుగా మాట్లాడారని, ప్రశ్నించే స్థానంలో వున్నారా? సమాధానం ఇచ్చే స్థానంలో వున్నారా అని వైసిపి నేత వాసి రెడ్డి పద్మ దుయ్యబట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… బుధవారం వైజాగ్ పవన్ చాలా విషయాలు మాట్లాడారని, హామీలు అమలు కానందుకు పవన్‌ను తాము నిలదీయాలన్నారు. చంద్రబాబుకు, తనకు సంబంధం లేదని ఇప్పటికైనా పవన్ అనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోపై చంద్రబాబు, పవన్, మోడీ బొమ్మ ఉందని గుర్తు చేశారు. మ్యానిఫెస్టో అమలు కాకపోతే పవనే బాధ్యుడని విమర్శించారు. టిడిపి ప్రభుత్వాన్ని కూర్చొబెట్టింది పవన్ కాదా, టిడిపి-బిజెపి పాలనలో పవన్ భాగస్వామి కాదా అని అడిగారు. టిడిపి పాలనతో తనకేం బాధ్యత లేదన్నట్టు పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడింది పవనేనని, ఓట్లను చీల్చడానికి పవన్ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శలు గుప్పించారు. పవన్ ఆవేశంతో ఊగిపోయి మాట్లాడుతున్నారని, నాలుగేళ్లుగా పవన్ కడుపు ఎందుకు మండలేదని, ఇవాళ అన్న కోసం కడుపు మండినట్టుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు టాబ్లెట్ వేసుకుని పవన్ నిద్రపోయారా అని ఎద్దేవా చేశారు.

Comments

comments