Search
Monday 21 May 2018
  • :
  • :
Latest News

చెన్నై భూమి కేసు: రాములమ్మకు ఊరట

VijayaShanthi

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ భూమి విషయంలో గత కొన్ని రోజులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న నటి విజయశాంతికి మద్రాసు కోర్టులో ఊరట లభించింది. ఒకే భూమిని విజయశాంతి ఇద్దరికి విక్రయించేందుకు యత్నించారంటూ ఇందర్‌చంద్ జైన్ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. చెన్నైలోని టీనగర్‌లో ఓ స్థలాన్ని విజయశాంతి తనకు అమ్మడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుని రూ. 4.68 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ తరువాత ఆ భూమిని వేరేవాళ్లకు విక్రయించారంటూ జైన్ పిటీషన్‌లో పేర్కొన్నాడు. ఐదేళ్ల క్రితం జైన్ వేసిన పిటీషన్‌పై మద్రాసు కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. వ్యక్తిగత తగాదాలతో పిటీషన్లు వేయరాదని జైన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… విజయశాంతిపై దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో విజయశాంతికి ఊరట లభించినట్లైంది.

Vijayashanti gets Relief from Court Case in Land Issue.

Comments

comments