Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

శ్మశానవాటిక కోసం రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు

rr

దహన సంస్కారాలకు స్మశాన వాటిక లేదని మెయిన్ రోడ్డుపై 

 శవంతో బైఠాయించిన కెరెల్లి గ్రామస్థులు

జిల్లా డిఎస్పీ శిరీషా రాఘవేంద్ర హామీతో సమస్య పరిష్కారం

ధారూర్: మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారం చేయండి ఎలాంటి సమస్యులు రాకుండా జాగ్రత్తలు చేపడతాం అని వికారాబాద్ జిల్లా డిఎస్పి శిరీషారాఘవేంద్రా గ్రామస్థులకు హామీ ఇచ్చారు.  ధారూర్ మండల కేంద్రంలోని  కెరెల్లి గ్రామానికి చెందిన బాయమొల్ల బిచ్చిరెడ్డి తండ్రి ఎల్లారెడ్డి వయస్సు (88) బుదవారం సాయంత్రం 8 గంటల సమయంలో మృతి చెందాడు. గురువారం చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికలో కర్రలు పేర్చుతుండగా పోలీసులు వెల్లి అట్టి స్థలంలో దహన సంస్కారం చేయకూడదని చెప్పారు. ఎందుకు చేయకూడదని కుటుంభీకులు గ్రామస్థులు ఆరా తీయగా అట్టి స్థలం సర్వే నెంబర్ 17లో హై కోర్ట్ స్టే వేరే వాల్లకి ఇవ్వడంతో ఆ స్థలంలో దహన కాండ చేయరాదని పోలీసులు తెలిపారు. దీంతో గ్రామస్థులు మృతి చెందిన బిచ్చిరెడ్డి దహన సంస్కారం ఎక్కడ చేయాలని స్థానిక ఎంఆర్ ఓ,ఆర్డీఓకు దరఖాస్తు చేసుకొని విన్న వించుకోగా వారినుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో కుటుంభీకులు గ్రామస్థుల సహకారంతో మృతి చెందిన బుచ్చిరెడ్డి శవాన్ని తీసుకొని ప్రధాన రోడ్డు పై బైటాయించారు. మాకు స్మశాన వాటిక స్థలం చూపించేంత వరకు రాస్తారోకో నిర్వహిస్థామని దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డు పై బైటాయించారు. సమాచారం అందుకున్న ధారూర్ సిఐ సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులను సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని వెంటనేపై అధికారులు ఆర్డీఓ, డిఎస్పి తో ఫోన్ లో సమాచారం చేరవేశారు. డిఎస్పి శిరీషా కెరెల్లి గ్రామంలోని సంఘటనా స్థలానికి చేరుకొని స్థలంలో జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఓలు చూపించిన స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. రెవన్యూ అధికారి ఆర్‌ఐ యాదయ్యను పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని సమస్యను పరిష్కరించారు. గతంలో అధికారులు చూపించిన సర్వే నెంబర్17లో దహన సంస్కారం చేయమని, ఏదైనా సమస్య వస్తే తను పరిష్కరించేదుకు కృషి చేస్తానని గ్రామస్థులకు ఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు రాస్తారోకో విరమించారు. బుచ్చిరెడ్డికి దహన సంస్కారం చేశారు. మల్లీ ఇలాంటి సమస్య రాకుండా చూడాలని గ్రామస్థులు డిఎస్పీని విన్నవించారు.

Comments

comments