Search
Monday 21 May 2018
  • :
  • :
Latest News

కోహ్లీ@ నెం.2

Virat-Kohli

దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ఐసిసి ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లలో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కోహ్లీ మూడు టెస్టుల్లో కలిపి ఏకంగా 610 పరుగులు చేశాడు. వీటిలో రెండు ద్విశతకాలు ఉన్నాయి. దీంతో విరాట్ రేటింగ్ పాయింట్లు మెరుగయ్యాయి. ప్రస్తుతం కోహ్లీ 893 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. లంకతో టెస్టు సిరీస్ కంటే ముందుకు విరాట్ ఆరో ర్యాంక్ లో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 938 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంక్‌లో ఉన్నాడు. మరో భారత బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా 873 పాయింట్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే కోహ్లీ టీ20, వన్డేల్లో నెం.1 ర్యాంక్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Virat Kohli moves up to No.2 in ICC Test rankings for batsmen.

Comments

comments