Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

నామినేషన్ దాఖలు చేసిన విశాల్

Vishal-Nomination

చెన్నై: నటుడు విశాల్ ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం నామినేషన్ దాఖలు చేశాడు. అభిమానులు, మద్దతుదారులతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్ అనంతరం విశాల్ మాట్లాడుతూ… తనకు ప్రజలకు ప్రతినిధిగా ఉండాలనుందన్నాడు.

Vishal

విశాల్ అంతకుముందు మెరీనా బీచ్ వద్ద దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నివాళులర్పించారు. ఆ తర్వాత శివాజీ గణేశన్, ఎంజిఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్‌కె నగర్ ఉప ఎన్నిక స్థానానికి డిసెంబర్ 21న పోలింగ్ నిర్వహించి, 24న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

Vishal files his nomination for RK Nagar Bypoll.

Comments

comments