Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

విద్యార్థుల అభ్యున్నతికి వైజ్ఞానికి ప్రదర్శనలు

school

*విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి
*జిల్లాపరిషత్ ఛైర్మన్ పద్మ

మనతెలంగాణ/వర్థన్నపేట రూరల్ : విద్యార్థులలో దాగి ఉన్న సృతజనాత్మకతను, ప్రతి భా పాటవాలను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయని జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు. గురువారం పర్వతగిరి మండలకేంద్రంలోని మోడల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన-2017ను జిల్లాపరిషత్ ఛైర్‌పర్స్‌ను పద్మ, వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భం గా పద్మ మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనా విధానంలో పరిణితితో కూడిన మార్పును, వికాసాన్ని తీసుకరావడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు ఎగ్జిబిట్స్‌ను తయారు చేయడంలో పోటిపడాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లే విధంగా ప్రదర్శనలను రూపొందించాలన్నారు.
– విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత
వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో 546 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల మనోవికాసానికి మానసిక పరివర్తనకు ఇలాంటి సైన్స్‌ఫేర్ ఉపయోగపడుతాయన్నారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగహన పెంపొందించుకొని ప్రకృతి సంపదల సంరక్షణకు, సమాజంలో చైతన్యం తీసుకరావడానికి విద్యార్థులు ప్రతిభ బూనాలని కోరారు. విద్యార్థులు నన్నపునేని నరేందర్ చర్చించారు. వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ చారిత్రిక వారసత్వ సంపద కలిగిన వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరువాత అంతటి పెద్దనగరంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఆర్‌టిసి బస్‌స్టాండ్ జంక్షన్‌ను గొప్పగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆరు స్మార్ట్ రోడ్లతోపాటు దేవాలయాలను  తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వైజ్ఞానిక ప్రదర్శన ఒక వేదిక లాంటిదని, ఈఅవకాశాన్ని సద్వినిఓగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల అభిరుచిని ప్రోత్సహించి తద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొంటూ వివిధ అంశాలపై ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులకు ఎంఎల్‌ఎ రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.-
పాఠశాల స్థాయి నుంచి సాంకేతిక
అంశాలపై అవగాహన:
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విద్యార్థులకు పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల అవగాహన కల్పించాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. భవిష్యత్తులో జాతికి ప్రయోజనకరమైన శాస్త్రవేత్తలుగా తీర్చి దిద్దడానికి పాఠశాల విద్యాశాఖ ఇలాంటి బృహత్తర కార్యక్రమాలకు రూపకల్పన చేసిందన్నారు. వరంగల్ నగరానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, ఆ పరంపర కొనసాగడానికి మనం అన్నిరంగాలలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభతో వైజ్ఞానిక రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడి రాజీవ్, డిఈఒ నారాయణరెడ్డి, పర్వతగిరి ఎంపిపి రంగు రజిత, జడ్‌పిటిసి మాదాసి శైలజ, పాల్గొన్నారు.

Comments

comments