Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

god3

* వైకుంఠ ఏకాదశికి భారీగా తరలివచ్చిన భక్తులు
* ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని
దర్శించుకున్న ఎంఎల్‌ఎ
* భక్తులకు అన్నదానం

మనతెలంగాణ/చిగురుమామిడి: జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచి దశాబ్దాల చరిత్ర కలిగిన మండలంలోని సుందరగి రి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ స ందర్భంగా ఆలయంలో ఉదయం 4గంటల నుంచి ఆలయ ంలో అర్చకులు శేషం శ్రీనివాసచార్యులు స్వామి వారికి ప్ర త్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి ప్రతిమలను అం దంగా పూల మాలలతో అలంకరించి పండగను ఘనంగా నిర్వహించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుదిక్కులతోపా టు,సిద్దిపేట,హైదరాబాద్,వరంగల్,ఖమ్మం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని ఉత్తర ద్వారం ను ంచి దర్శించుకున్నారు.భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్ల్లను చైర్మన్ ఎప్పటికప్పుడు పరిశీలించారు. హుస్నాబాద్ ఎంఎల్‌ఎ సతీష్‌కుమార్,టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి స్వామి వారిని ద ర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంఎల్‌ఎ సతీష్‌కుమార్ మాట్లాడుతూ పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. సుందరగిరి శ్రీవేంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని,స్వామి వారు మొక్కిన మొక్కులు తీ ర్చే స్వామిగా ప్రసిద్దిగాంచారని చెప్పారు.
ఆలయ అభివృద్ధికి తప్పకుండా తన వంతు కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఎంఎల్‌ఎ సతీష్‌కుమార్‌ను, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని ఆలయ చైర్మన్ రమణారెడ్డి శాలువలు మె మోంటోలతో ఘనంగా సన్మానించారు. భక్తులకు రిటైర్డ్ టి చర్ చీకోటి రమణయ్య-సత్తవ్వ దంపతులు దాదాపు వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్‌కుమార్,హుస్నాబాద్ మాజీ ఎంపిపి ఆకుల వెంకట్,నగర పంచాయతీ ఛైర్మణ్ సు ద్దాల చంద్రయ్య, డిప్యూటీ తహసీల్దార్ గుగ్గిళ్ల రమేష్, జడ్‌పిటిసి శేఖర్‌పటేల్,సర్పంచ్‌లు వంతడ్పుల వెంకటస్వామి, గీ కురు రవీందర్,వైస్ ఎంపిపి ఆకవరం భావాని,నాయకులు బొద్దిరెడ్డి శ్రీధర్‌రెడ్డి,బుర్ర శ్రీనివాస్‌గౌడ్,వంతడ్పుల దీలిప్,స ర్వర్‌పషా,కోనేటి రాములు,బత్తిని సత్తయ్యగౌడ్,తాళ్లపల్లి తి రుపతిగౌడ్,పత్తెం వీరస్వామి పటేల్, మాజీ ఆలయ చైర్మన్లు కంది తిరుపతిరెడ్డి,తాళ్లపల్లి రాజయ్యగౌడ్ పాల్గొన్నారు.

Comments

comments