Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

మాకూ స్వాతంత్య్రం కావాలి

int

మా ప్రెసిడెంట్ మాకు కావాలి

బ్రస్సెల్స్:స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోసం వేలాది మంది కేటాలియన్లు గురువారం ప్రదర్శనలకు దిగారు. తమ డిమాండ్‌కు యురోపియన్  యూనియన్ (ఇయూ(య మద్ధతు ఇవ్వాలని ప్రదర్శనకారులు బ్రస్సెల్స్‌లోని ఇయూ ప్రధాన కార్యాలయం పరిసరాలు వీరి నినాదాలతో హోరెత్తాయి. పదవీచ్యుత ప్రెసిడెంట్ కార్లెస్ ప్యూగ్‌డిమోంట్‌కు అనుకూలంగా ప్రదర్శనకారులు నినదించారు. యూరప్ మేలుకో అంటూ తమ ప్రత్యేక దేశం గుర్తింపును తెలిపే ఎరుపు, పసుపు, నీలి అంచు జెండాలు ఎగురవేస్తూ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పార్క్ పరిసరాలలో వీరు మొహరించారు. తమ అధ్యక్షుడిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని, తాము ప్రెసిడెంట్‌ను వదులుకోదల్చుకోలేదని, ప్రవాసంలో ఉన్న ప్రెసిడెంట్ తిరిగి వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. తాము ఇక్కడికి వచ్చింది తమ ప్రత్యేక ప్రాంతానికి స్వాతంత్య్రం కోసం అని రాజకీయ ఖైదీలకు విడుదల కోసం అని , తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్పెయిన్ నుంచి కాటలోనియా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత తీవ్రస్థాయిలో స్పెయిన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ దశలో  ఆ ప్రాంత అధ్యక్షుడిని ఇతరులను పదవీచ్యుతులను చేశారు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ నలుగురు మాజీ మంత్రులు బ్రసెల్స్‌కు పారిపొయ్యారు. ఇయూపై ఒత్తిడి తెచ్చి పరిస్థితిని సానుకూలం చేసేందుకు రాజకీయంగా యత్నిస్తున్నారు.

Comments

comments