Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ముదిరాజ్‌ల హక్కుల సాధనకై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

mudiraj

మనతెలంగాణ/ దోమకొండ :ముదిరాజ్‌ల హక్కుల సాధనకై ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కోకన్వీనర్ అబ్రబోయిన స్వామి అన్నారు. బుధవారం దోమకొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముదిరాజ్‌లను బిసిడిలో చేర్చడం వల్ల అన్యా యం జరిగిందని, ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల్లో ము దిరాజ్‌లను ఎస్టీలుగా గుర్తించారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముదిరాజ్‌లను బిసిడిలుగా పరిగణించడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పో యి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదగలేక దుర్బ ర జీవితం గడుపుతున్నరన్నారు. ముదిరాజ్‌లను బిసిడి నుండి బిసిఎలోకి మార్చాలని డిమాండ్ చేశా రు. జిల్లాలోని ప్రతి పల్లెల్లో ముదిరాజ్ గ్రామసభలు, జెండావిష్కరణ, బైక్‌ర్యాలీలు నిర్వహిస్తూ ఉద్యమాలకు సిద్ధ్దం కావాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ముదిరాజ్‌లపై వ చ్చే ఫిర్యాదులపై పోలీసులు వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులను మానవత్వంతో ఆలోచించాలని కోరారు. ముదిరాజ్‌ల్లో చాలా వరకు విద్యార్థులు వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేక మధ్యలోనే చదువును మానేస్తున్న పరిస్థితి నెలకొంది. ముదిరాజ్‌ల కొరకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పా టు చేసి పిల్లల అభివృద్ధికి, ముదిరాజ్‌ల్లో విద్యాశాతంను పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలోను ముదిరాజ్‌లకు పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వ భూములను కేటాయిం చి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి స త్యం, రమేష్, సిద్దిరాంలు, రాములు, సీతా రాం, రాజ్‌వీర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments