Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి

distభువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్
మన తెలంగాణ/జనగామ ప్రతినిథి: కేంద్రప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలవుతున్న పలు పథకాలు అర్హులైన వారికి చేరవేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని భువనగిరి ఎంపి బూరనర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డిఆర్‌డిఓ జయచండ్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజల సమస్యలను అధికారులు వాయిదా వేయకుండా త్వరగా పరిష్కరించాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఎంతగానో మార్పు వచ్చిందన్నారు. జిల్లాలో అసంక్రమిత వ్యాధులనివారణ గుర్తింపు కార్యక్రమంలో భాగంగా 1,32,385మందికి ఆరోగ్యపరీక్షలు జరుపడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో 75శాతం ప్రసవాలు పెరిగాయన్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా యంత్రాంగం చూపుతున్న శ్రద్ధ అభినందనీయం అన్నారు. మున్సిపల్ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు తన నిధులు వెచ్చిస్తానన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉన్నందున సీవరేజెస్ చార్జీలు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎల్‌ఏ రాజయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ ఏ. శ్రీదేవసేన మాట్లాడుతూ జిల్లాలో 2 నెలల వ్యవదిలో 30 శాతం ఉన్న మరుగుదొడ్లను 80 శాతానికి పెంచామన్నారు. ఆసుపత్రుల అభివృద్ది కమిటి సమావేశం నిర్వహించి వచ్చిన నిధుల వినియోగంపై దృష్టి సారించాలని డిఎంహెచ్‌ఓకు సూచించారు. జనగామ మున్సిపల్ పరిధిలో పందులను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కమీషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, తదితరలు పాల్గొన్నారు.

Comments

comments