Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

ఆ ఫోన్స్ వాడుతున్న వారికి వాట్సాప్ నిలిపివేత!

1400 Crores Messages shared in Whatsapp

హైదరాబాద్: టాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలను డిసెంబర్ 31 తరువాత కొంతమంది వినియోగదారులు కోల్పోనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న వాట్సాప్ త్వరలో కొన్ని మొబైల్స్‌లలో పనిచేయదట. కొన్ని ప్రత్యేక ఒఎస్‌లు గల ఫోన్‌లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాటిలో బ్లాక్‌బెర్రీ ఒఎస్, బ్లాక్‌బెర్రీ 10 ఒఎస్, విండోస్ 8.0 ఒఎస్ ఉన్న మొబైల్స్‌లో డిసెంబర్ 31, 2017 తర్వాత వాట్సాప్ సపోర్ట్ చేయదు. అంతేగాక నోకియా ఎస్40 గల మొబైల్స్‌లో డిసెంబర్ 31, 2018 అనంతరం వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 2.3.7 ఒఎస్ ఉన్న మొబైల్స్‌లో ఫిబ్రవరి 1, 2020 నాటికి వాట్సాప్ పనిచేయదు. సో… గడువులోగా పై ఒఎస్‌లు గల  ఫోన్లు ఉన్న వినియోగదారులు ఆప్ గ్రేడేడ్ ఒఎస్‌లు గల మొబైల్స్ కు మారిపోవడంతో వాట్సాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.

WhatsApp to stop working from December 31 some platforms.

Comments

comments