Search
Friday 20 April 2018
  • :
  • :

రైతుల అభివృద్ధికి కృషి

trs

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : రైతులు సకాలంలో పంటలు వేసి పోటీతత్వంగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోన్ మండలంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. రూ.25 లక్షలతో కడ్తాల్, రూ.13 లక్షలతో జాఫ్రాపూర్, రూ.13 లక్షలతో మాదాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాలు నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ విద్యవైద్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అలాగే విద్యార్థులు బాగా చదివి మంచి భవిష్యత్తును పొందాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో రాణించాలంటే మొదటి నుంచి చదువుపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. అలాగే ఈ నెల 25 నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు నుండి సరస్వతి కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నారని, రైతులు సకాలంలో పంటలు వేసి, పోటీతత్వంగా ఉండాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి రూ.12 వేలు, ఇంకుడు గుంతలు నిర్మించకున్న వారికి రూ.4వేలు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతీ ఒక్కరు వీటిని నిర్మించుకోవాలని సూచించారు. అలాగే జనవరి నుండి 24 గం॥ల నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శోభాసత్యనారాయణ, ఎంపిపి దౌలన్‌బీ మౌలన, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మాజీ ఎంఎల్‌ఎ నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎంపిడిఒ గజ్జరం, తహసీల్దార్ శివప్రసాద్, గోవర్థణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Comments

comments