Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

రైతుల సంక్షేమానికి కృషి

harish

*డిండి ఎత్తిపోతల కోసం రూ. 6500 కోట్లు మంజూరు
*రూ. 32 కోట్లతో దేవరకొండ నియోజకవర్గంలో వ్యవసాయ గోదాముల నిర్మాణం
*46 వేల చెరువుల మరమ్మతులతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు
*మూడు నెలల్లో 95శాతం భూ ప్రక్షాళన పూర్తి, 3 లక్షల 71వేల 630 భూ సమస్యలు పరిష్కారం
*కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహ్మరెడ్డి, జగదీష్‌రెడ్డి

 మనతెలంగాణ / కొండమల్లెపల్లి :-  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని  రాష్ట్ర వ్యవసాయ, భారీ నీటి పారుదల శాఖల మంత్రి పన్నీరు హరీష్‌రావు అన్నారు.  శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నా బార్డు నిధులతో ఏర్పాటు చేసిన  2500 మెట్రిక్  టన్నుల సామర్థం గల గోదామును రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, విద్యుతు శాఖ మంత్రి కునుకుంట్ల జగదీష్‌రెడ్డిలతో కలసి  ప్రారంభించారు. అనంతరం దేవరకొండ ఎమ్యెల్యే రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. రైతుల కోసం మిషన్ కాకతీయ పథకం ద్వారా  46 వేల చెరువులను మరమ్మత్తులు  చేపట్టి 16 లక్ష ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని  చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వా నికి  దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మూడు నేలల్లో భూ ప్రక్షాళాన కార్యక్రమం  అధికారులు రైతుల దగ్గరే వచ్చి 95 శాతం సర్వే చేసి రైతులకు 3 లక్షల 71 వేల 630 మంది రైతుల భూ సమస్య లేకుండా అన్‌లైన్‌లోనే  పరిష్కారించారన్నారు. ఈ భూ ప్రక్షాళాన ద్వార  రైతులకు ఎకారనికి  రూ.8 వేల ప్రభుత్వం పెట్టుబడి  కోసమేన రైతులు సాగు కోసం అప్పుల చేయకుడదనే లక్షంతో మన ముఖ్యమంత్రి కెసిఆర్ అశయమాని అన్నారు.  రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు చేయాని పని టిఆర్‌ఎస్ ప్రభుత్వం 3 సంవత్సరాల్లోనే చేసిన ఘనత కెసిఆర్‌కే చెల్లిందని తెలిపారు.

రానున్న రోజుల్లో నల్లగొండ జిల్లా సాగు నీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని పెండ్లిపాకుల రిజర్వాయర్ నిర్మాణ పనుల జాప్యం గురించి కాంట్రాక్టర్‌తో చర్చించి త్వరలో పనుల ప్రారంభమయ్యాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డిండి రిజర్వాయర్ ముంపు బాధితులకు కోసం రూ. 6.500 మంజూరు చేసిన ఇంక అందని ముంపు బాధితులకు   నష్టపరిహారం వారం పది రోజుల్లో అందేల చర్యలు తీసుకుంటామన్నారు.పెండ్లిపాకుల రిజర్వాయర్ కింద ముంపుకు గురవుతున్న గ్రామాలకు, తండాలను  జిల్లా కలెక్టర్  చర్చించి తగిన విదంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.రైతుల సమస్యలను పరిష్కరానికి 500 మంది ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 వేల మంది వ్యవసాయ అధికారులను నియమించామని, ప్రతి మూడు గ్రామాలకు రైతు సమావేశ మందిరాన్ని నిర్మాణం చేపట్టి రైతుల సమస్యలను అక్కడే పరిష్కరమయ్యేల చూస్తామన్నారు. రైతులకు 100శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామన్నారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి, దొండ, నిమ్మ మార్కెట్‌లను ఏర్పాటు చేశామన్నారు.  రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో 60 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకులేని తెలంగాణ 3 సంవత్సరాలలో అభివృద్ధి  జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని ఎవరు అడ్డుపడ్డ తెలంగాణ అభివృద్ధి అపలేరని అన్నారు. కెసిఆర్ కలుగన్న బంగారు తెలంగాణగా మారుస్తారని అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కునుకుంట్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పరిపాలను చూసి ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్‌కు ముచ్చేమటలు పడుతున్నాయని కెసిఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రజలు అకర్షితులై తమ ఉనికి కొల్పోతామనే భయం ఏర్పడిందన్నారు.రానున్న ఎన్నికల్లో జిల్లాలో టిఆర్‌ఎస్ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచి  కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, అచ్చంపేట ఎమ్యెల్యే గువ్వలరాజు, జిల్లా కలెక్టర్ గౌరవ ఉప్పల్, జాయింట్ కలెక్టర్  సత్యనారయణరెడ్డి, ఆర్డీవో లింగ్యానాయక్, అటవిశాఖ చైర్మన్ బండ నరెందర్‌రెడ్డి,  ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, వైజ్ ఎంపీపీ దూదీపాల వేణూదర్‌రెడ్డి,  జడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, సర్పంచ్ అందుగుల ముత్యాలు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు, సిరాజ్‌ఖాన్, మారుపాక సురేష్‌గౌడ్, పున్న వేంకటేశ్వర్లు, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, వస్కుల తిరుపతమ్మకాశయ్య, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments