Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

ministr

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

వికారాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు చేపడుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్నదివ్యాంగులలో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాకు లక్ష రూపాయల చొప్పున దివ్యాంగుల క్రీడా పోటీలకు ప్రభుత్వం కేటాయించి క్రీడాపోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు గచ్చిబౌలిలో నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులకు అన్ని రంగాలలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ, ఎస్‌సి కార్పోరేషన్ రుణాల పంపిణీలో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలో బిసి, ఎస్‌టి కార్పోరేషన్ రుణాలలో దివ్యాంగులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వికారాబాద్ జిల్లా ఏర్పడిన కొత్తలో సదరన్ క్యాంపులు నిర్వహించి వికలాంగులకు నియోజకవర్గ స్థాయిలో సదరన్ క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా అవసరమైతే మరోసారి సదరన్ క్యాంపులు నిర్వహించి క్యాంపులు నెల రోజుల లోపల చేపడుతామని చెప్పారు. ఎమ్మెల్యే బి.సంజీవరావు మాట్లాడుతూ, వికలాంగులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు. టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ పర్యాద క్రిష్ణమూర్తి మాట్లాడుతూ, వికారాబాద్‌లోని అనంతగిరిలో ఆయూష్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిఆర్‌డిఒ జాన్సన్ మాట్లాడుతూ, జిల్లాలోని 12,700 మంది దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఐసిడిఎస్ ఆర్గనైజన్ వీరమణి, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్, ఎంపిపి భాగ్యలక్ష్మి, జడ్‌పిటిసి సభ్యుడు ముత్తార్‌షరీఫ్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ చిన్నఅప్పలనాయుడు, ఎంపిడిఒ సత్తయ్య, మార్కెటి చైర్మన్ రాంచంద్రారెడ్డి, డిపిఎం శ్రీనివాస్, ఎపిఒ లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులకు పలు పథకాల కింద రుణాలు, సర్టిఫికెట్లు, ట్రై సైకిళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

Comments

comments