Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఎయిడ్స్ రహిత జిల్లా ఏర్పాటుకు కృషి

flag

కలెక్టర్ సత్యనారాయణ
మన తెలంగాణ/కామారెడ్డి: ఏయిడ్స్ రహిత జి ల్లాగా కృషి చేసినప్పుడే అనుకున్న లక్షం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఏయిడ్స్ దినం సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఏయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక ఇండియన్ మెడికల్ అ సోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్‌ఐవి వ్యాప్తి 5.25 శాతం నుండి 0.99 వరకు తగ్గించడం జరిగిందని ఏయిడ్స్ మహమ్మారిని దేహం నుండి త రిమి కొట్టినప్పుడే మనిషి ప్రవర్తన మారుతుందన్నారు. మనిషి తప్పిదాల వల్ల సంక్రమించే ఈ వ్యాధి సమాజానికి పెను ముప్పులా మారుతుందన్నారు. యువత దీని బారిన పడి నిర్వీర్యం కావద్దని మనకు మనమే చైతన్యం కావాలని తెలిపారు. హెచ్‌ఐవి సోకిన పిల్లల కోసం డిచ్‌పల్లిలో బాలల మానవతా సదన్ హోం సేవలు అందించడం జరుగుతుందన్నారు. వారి ధైర్యమే గొప్ప ఆరోగ్యమని అన్నారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించా రు. ఏయిడ్స్ నివారణ చైతన్య పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ, జిల్లా వైద్యశాఖ అధికారి మధుశ్రీ, డిసిఎచ్ వో అజయ్ కుమార్, ఐసిడిఎస్ అధికారి రాధమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి చంద్రశేఖర్, సోం రాజ్ సింగ్ ,తదితరులు పాల్గొన్నారు.

Comments

comments