Search
Wednesday 21 March 2018
  • :
  • :
Latest News

నేడు వరల్డ్ ఎయిడ్స్ డే

HIVనగరంలో హెచ్‌ఐవి బాధితుల మనోవేదన

ప్రతి ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినంగా పాటించడం జరుగుతోంది. 1981 జూన్ 5న మొదటిసారి అమెరికాలో నలుగు రు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోకింది. భారతదేశంలో మొదటిసారిగా 1986లో ఎయిడ్స్‌ను గుర్తించారు. 1987లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం మొదలైంది. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో హెచ్‌ఐవీ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం…

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో యాంటీ రిట్రో టెస్ట్ (ఏఆర్‌టీ) సెంటర్లలో హెచ్‌ఐవీ బాధితులకు వేదన తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. ఇతరులకు చెప్పుకోవడానికి వారు పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితుల్లో ముఖాన్ని చాటు చేసుకుని గుట్టుగా ప్రభుత్వాస్పత్రుల్లోని ఏఆర్‌టీ సెంటర్లకు వెళితే మందులు ఇచ్చే క్రమంలోనూ, వైద్య పరీక్షలు నిర్వహించడంలోనూ వైద్యులు, సిబ్బంది చిన్న చూపు చూస్తూ వేధిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇతర కే్రందాలకు బదిలీ చేయించుకుంటున్న దుస్థితి నెలకొం ది. ఈ విషయమై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (న్యాకో), జిల్లా వైద్యశాఖ ఉన్నాతాధికారులు పట్టించుకోవడం లేదు. నగరంలో హెచ్‌ఐవీ బాధితులు సుమారు 40వేల మం ది వైద్య సేవలు పొందుతున్నారు. ఇందులో నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఎర్రగడ్డ టీబీ సెంటర్, కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రుల్లో 30 వేల మంది వైద్యసహాయం పొందుతున్నారు. మిగతా 10వేల మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం హెచ్‌ఐవీ బాధితులకు ప్రత్యేకంగా గుర్తించి వైద్యం, మందులు అందించేందుకు కార్డులు జారీ చేసింది. హెచ్‌ఐవీ పాజిటివ్ అయిన అందరూ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అయితే సోకినట్టుగా గుర్తించిన ప్ర తి ఒక్కరూ నెలకోసారి సీడీ4 కౌంట్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో సీడీ4 కౌంట్ 350కి తక్కువగా ఉన్నట్టు గుర్తిస్తే మందులు రెగ్యూలర్‌గా వాడాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే నగర ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ బాధితు లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో సీడీ4 కౌంట్ తక్కువగా ఉన్నవారు సగానికి సగం మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా ఈ పరీక్ష నిర్వహించి మందులు అందిస్తారు. బాధితుల్లో 15ఏండ్ల నుంచి సుమారు 70 ఏండ్ల వరకు వయస్కులైన మహిళలు, పురుషులు ఉన్నారు. పలు ఆసుపత్రుల్లో వైద్యం కోసం వచ్చే వారి పట్ల వైద్యులు, సిబ్బంది అసభ్యకరమైన పదజాలంతో వ్యవహరిస్తున్న ట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు అ భ్యంతరమైన వ్యాఖ్యలతో మాట్లాడుతారని, హెచ్‌ఐవీ ఎలా సోకిందనే విషయాన్ని తెలుసుకునే సాకుతో మానసికంగా వేధిస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను వేరే ఏఆర్‌టీ సెంటర్‌కు మార్చాలంటూ వందలాది మంది దరఖాస్తుచేసుకోగా ఉన్నాతాదికారులు పరిశీలిం చి ఇందులో కొంత మందిని కూడా ఇతర కేంద్రానికి బదిలీ చేశారు. ప్రభుత్వాసుత్రుల్లోని ఏఆర్‌టీ సెంటర్లలో బాధితులకు స్వాం తన కల్పించేలా వైద్యులు, సిబ్బంది వ్యవహరించాలని హెచ్‌ఐవీ బాధితులు ఆశిస్తున్నా రు. మందులు పూర్తిస్థాయిలో అందించాలని , అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా ప్ర భు త్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆసరా కోసం ఎదురు చూపే..
తెలియక తెచ్చుకున్న జబ్బుకుతోడు ఇంట్లో, సమాజంలో అడుగడుగునా అగౌరవం అసమానతలు ఎదుర్కొనే హెచ్‌ఐవీ-, ఎయిడ్స్ బా ధితుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది. వీరికి రూ. 1000 ఆసరా కల్పించేందుకు తెలంగాణ ప్ర భుత్వం ముందుకు వచ్చినా అధికారులు, సి బ్బంది పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా నగరంలోని ఐదు ప్రధాన ఏఆర్టీ సెంటర్లలో సుమారు 30వేల మంది బాధితులుంటే అం దులో 8వేల మందికి ఆస రా ఫించన్లు అందడంలేదు. వీరీలో కొందరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారు. దరఖాస్తు చేసుకొని నాలుగేళ్లవుతు న్నా ఫించన్ మాత్రం నేటికి అందడంలేదని బాధితులు వాపోతున్నారు. దీనికితోడూ ఏఆ ర్టీ సెంటర్లలో మందులు కూడా సకాలంలో అందడంలేవని, పలుచోట్ల కిట్ల కొరత కూడా వేధిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

Comments

comments