Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

మనోధైర్యంతో ముందుకు సాగాలి

rj

8సినీ నటుడు రాజశేఖర్

సిటీ బ్యూరో : వికలాంగులమని  నిరుత్సాహపడరాదని సినీనటులు రాజశేఖర్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం నెక్లెస్‌రోడ్‌లో వికలాంగుల   నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి,  సినీ నటులు  రాజశేఖర్,  జీవిత, ఎమ్మెల్యే  చింతల రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రాజశేఖర్ మాట్లాడుతూ తాను కూడా వికలాంగుడినేనని, అయితే  దానిని ఆత్మవిశ్వాసంతో జయించానని చెప్పారు.తనకు చిన్నప్పుడు నత్తి ఉండేందని,  బస్సులో ప్రయాణించే సమయంలో తాను చదువుతున్న కళాశాల పేరు సైతం పలుకలేకపోయేవాడినన్నారు. అలాంటి తను ఆత్మ విశ్వాసంతో నత్తిని జయించి నేడు సినిమాల్లో నటించగలుగుతున్నానని, వికలాంగులకు ఎవరి జాలి అవసరం లేదని, సహకరిస్తే మేలు చేసిన వారు అవుతారని ఆయన అన్నారు. అదేవిధంగా వికలాంగులు నిరుత్సాహపడకుండా నమ్మకంతో, ధైర్యంగా ముందుకు సాగాలని, తన జీవితాంతం వికలాంగులకు సహాయం చేస్తానన్నారు.  ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లు మాట్లాడుతూ వికలాంగుల సంక్షే మం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.33 కోట్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. దివ్యాంగులు గతంలో రూ. 500 పెన్షన్  కోసం ఉద్యమాలు చేస్తే, ఎవరు కోరకుండానే  రూ.1500 ల పెన్షన్ అందించిన  ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని  అన్నారు. ట్రైసైకిల్, కంప్యూటర్,  ఎలాంటి సౌక ర్యం కల్పించడానికైనా ప్రభుత్వ సిద్ధంగా ఉందని వారు చెప్పారు. వికలాంగులకు సేవ చేయడమంటే దేవుడికి సేవ చేసినట్లేనని వారు అన్నారు.

Comments

comments