Search
Monday 11 December 2017
  • :
  • :

మణికట్టు నొప్పి మటుమాయం

ప్రస్తుత కాలంలో  మారిన జీవన శైలి విధానం వల్ల, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల   చాలా మంది మణికట్టు (రిస్ట్ జాయింట్) నొప్పితో  బాధపడుతున్నారు. నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా, వస్తువులను      పైకెత్తాలన్నా, గట్టిగా పట్టుకోవాలన్నా, మణికట్టు కీలు, కండరాల కదలికతోనే చేయాల్సి  ఉంటుంది. మణికట్టు కీలులో మార్పు రావడంతో నొప్పి ఆరంభమై పనులు చేయడం కష్టంగా మారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాలి.  

మణికట్టు ఎముక లోని ‘కార్టిలేజ్ ’ లో మార్పు రావటం.
ఆర్థ్రరైటీస్ , గాంగ్లియాన్ ఏర్పడుట, కార్పెల్ టన్నల్ వ్యాధి వల్ల
మణికట్టు ఎముక ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం.
మణికట్టు వద్ద కండరాలు ఒత్తిడికి లోనుకావడం
అనుకోకుండా మణికట్టుకు దెబ్బ తగలటం
లక్షణాలు : మణికట్టు (రిస్ట్ జాయింట్) కదలిక కష్టంగా మారును.
చేత్తో వస్తువులను పట్టుకోవాలన్నా , రాత రాయాలన్నా తీవ్రంగా నొప్పి వుంటుంది
కంప్యూటర్స్ కీ బోర్డ్ వాడుతుంటే నొప్పి వస్తుంది.
నొప్పి మణికట్టు నుండి మొదలై చేతి భుజంలోకి వ్యాపిస్తుంది
రాత్రి పూట నిద్రలో కూడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది
జాగ్రత్తలు : మణికట్టు (రిస్ట్ జాయింట్) నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తడం చేయకూడదు.
నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి
మణికట్టు నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
మణికట్టు కదలికలకు సంబంధించి వ్యాయామాలు చేసేటప్పుడు ‘ఫిజియోథెరపీ’ వైద్యుల సలహా తీసుకోవాలి.
పరీక్షలు : ఎక్స్‌రే, ఎవ్‌ు.ఆర్.ఐ , ఆర్. ఎ ఫ్యాక్టర్ లాంటి పరీక్షలు మణికట్టు నొప్పి తీవ్రతను తెలుపుతాయి.
చికిత్స : మణికట్టు నొప్పి లక్షణాలను, వ్యక్తిత్వ లక్షణాలను పరిగణలోనికి తీసుకొని వైద్యం చేయాలి.
మందులు :

                    Wrist

బ్రయోనియా : మణికట్టు కదలికల వల్ల బాధ ఎక్కువౌతుంది. విశ్రాంతి తీసుకుంటేగానీ తగ్గదు. దాహం ఎక్కువగా ఉంటుంది. మలబద్దకంతో బాధ పడుతుంటారు. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి బ్రయోనియా మందు పనిచేస్తుంది.

రస్టాక్స్ : మణికట్టు ్ట నొప్పి మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండుట గమనించ దగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రి పూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం సరిపడదు. అనుకోకుండా బెణకటం వల్ల వచ్చే మణికట్టు నొప్పికి ఈ మందు బాగా పని చేస్తుంది.

హైపరికం: మణికట్టు ఎముక మధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పుల వల్ల నాడులు ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల వచ్చే మణికట్టు నొప్పికి, ఎడమ చేతికి లేదా కుడి చేతికి వ్యాపించి బాధించే కండరాల నొప్పికి ఈ మందు ప్రయోజనకారి.

ఆర్నికా : పడటం వల్ల మణికట్టు ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వల్ల నొప్పి ఉంటే ఈ మందు వాడుకోవాలి. శారీరక శ్రమ అనంతరం మణికట్టు నొప్పి వేధిస్తుంటే ఈ మందు వేసుకోవాలి. ఇవేకాకుండా రూటా, బెంజోయికి ఆసిడ్, మెడోరినం, ఆక్టియోస్పైకేట, అగారికస్, కాల్కేరియాకార్బ్, సల్పర్, కాలికార్బ్, కోలోసింత్, మాగ్‌ఫాస్, సింఫైటినం వంటి మందులను నొప్పి లక్షణాలను బట్టి వైద్యుని సలహాతో వాడుకోవాలి.

డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ హోమియోఫిజీషియన్,
హన్మకొండ.

Comments

comments