Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

బన్ తింటూ … టి తాగుతూ …

JAGAN-TEA

అనంతపురం : వైసిపి అధినేత జగన్ పాదయాత్ర మంగళవారంతో 27వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఆయన తన పాదయాత్రను గుత్తి నుంచి ప్రారంభించారు. ఓ అభిమాని ఇచ్చిన బన్ తింటూ, టి తాగుతూ ఆయన ప్రజా సమస్యలను ఆలకించారు. టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ప్రజల్లో చైతన్యం తెస్తూ ముందుకు సాగుతున్నారు. రైతు సమస్యలు, లభించని గిట్టుబాటు ధర తదితర సమస్యలపై ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీరుస్తామని ఆయన ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎపి సిఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఆయన ప్రజలను కోరారు.

YCP Chief Jagan Pada yatra in Anantapur

Comments

comments