Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

భరతనాట్యం బహుశాస్త్ర సమ్మిళితం

మన పూర్వీకులు,గురువులు  దూరదృష్టితో ఆలోచించి సమాజానికి అవసరమైన అనేక అంశాలను ప్రజల ముందుంచారు. అయితే వాటి అవసరం మేరకు వాడుకుంటున్నారే కానీ వాటి అంతరాల్లోకి వెళ్ళడం లేదు.

సంప్రదాయ నృత్యమైన భరతనాట్యం అనేక శాస్త్రాల సమ్మిళితం.  నాలుగున్నర దశాబ్దాలపాటు 75 ప్రపంచ దేశాల్లో భరతనాట్యాన్ని ప్రదర్శించి నాట్యంలోని భిన్నపార్స్యాలను శోధించి, విభిన్నశాస్త్రాల సారాన్ని విశ్లేషించి,  భావితరాలకు అందిస్తుంది భరతనాట్య గురువు రాజేశ్వరీ సాయినాథ్. సికింద్రాబాద్ సిక్ విలేజ్‌కు చెందిన రాజేశ్వరి తన పదవ ఏటనే కాలుకు గజ్జకట్టింది. భరతనాట్యానికి విభిన్న శాస్తాలతో ఉన్న సానిహిత్యాన్ని మిళితంచేసి, నృత్యం కేవలం ఓ నర్తనం కాదు మానవ జీవన విధానానికి ఔషధం  అంటున్న రాజేశ్వరిని అఖిల పలకరించింది.  

                 Classical-Dance

ప్ర: నాట్యం అంటే ఒక కళాప్రదర్శనగా భావించవచ్చా?

జ. నాట్యాన్ని కొద్దిసేపు ప్రదర్శించి ప్రేక్షకులను ఆనందభరితం చేయడం కాదు. నాట్యవిధానాల్లో దాగిన అంర్గత వివరాలు వారికి అర్థమయ్యే రీతిలో చేయాలి. భరతనాట్యమంటే ఖరీదైన అలంకరణ, ఆభరణాలు అనే అభిప్రాయం పోవాలి. నాట్యంలో క్రమశిక్షణ, జీవన విధాన ఔన్నత్యం, ఏకాగ్రత ఉంది. భరతనాట్యంతో ఇవి అలవడే అవకాశాలు అనేకం. క్రమబద్ధంగా భరతనాట్యాన్ని ప్రదర్శిస్తే మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది.

ప్ర: నృత్యాల్లో ఏ శాస్త్రాలు మిలితమై ఉన్నాయి. అవి మానవ శరీరాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయి?

జ. శరీరం ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, ఆహ్లాదకరమైన ఆలోచనలు ఉండాలి. ప్రస్తుత యాంత్రిక యుగంలో వీటి గురించి ఆలోచించేవారెందరు. మాససిక ఒత్తిడితో తల్లడిల్లి పోతుంటారు. మస్తిష్కం నుంచి వేగమైన ఆలోచనకు అంతరాయాలు కలుగుతుంటాయి. మెదడు వేగవంతమైన ఆలోచనను శరీరానికి అందించినప్పుడు అంతకంటే వేగంగా శరీరం స్పందిస్తేనే ఆలోచన పరిధి పెరుగుతుంది. నాట్య ప్రదర్శకులకు ఎలాంటి ఒత్తిడులు ఉండవు. నృత్యప్రదర్శనతో అవయాల కదలిక లయబద్దమైన సంగీతంతో అనుసంధానం కావడంతో మెదడు ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో ఉంటుంది. మేధోశక్తి ఆరోగ్యంగా ఉంటేనే పాజిటివ్‌నెస్ పెరుగుతుంది. నృత్యకారులకు సమాజానికి ఏదైనా చేయాలనే పట్టుదల వస్తుంది. నృత్యకారిణి శరీరం, మెదడు మధ్య సమన్వయం ఉంటుంది. ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఉండటంతో నృత్యం ప్రదర్శించే విద్యార్థులు చదువుల్లోను ముందుంటారు.

ప్ర: భరతనాట్యంలో యోగా, గణిత శాస్త్రం ఉందంటున్నారు మీరు?

జ.ఈ రెండు శాస్తాలు అత్యధికంగా ఉంటాయి. ప్రతి భంగిమ యోగాతో అనుసంధానమై ఉంటుంది. నాట్యకారులెప్పుడూ ఆరోగ్యంగా స్లిమ్‌గా ఉండానికి ఇదే కారంణం. డాన్స్ ప్రాక్టీసు చేసేవారు యోగా కంటే ఫలితాలు అధికంగా పొందుతారు. గణితం భరతనాట్యానికి ఎంతో అవసరం.

ప్ర: నృత్యం నేర్చుకునే విద్యార్థులు, చదువులపై ఎలాంటి ఏకాగ్రతను కలిగివుంటారు?

జ. భరతనాట్యం లయబద్ధంగా ఏకాగ్రతతో నేర్చుకుంటే మెదడులో పెరిగే శక్తి, చదువులపై మంచి ప్రభావం చూపుతుంది. నా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు ఒకేసారి పరీక్షరాసి ఐ.ఐ.టి సాధించిన వారు అనేకం ఉన్నారు. సాధారణ ఐ.ఐ.టి విద్యార్థి కంటే భరతనాట్యం అభ్యసించిన విద్యార్థి నాలెడ్జ్ లెవల్స్ అధికశాతం ఉంటాయని ఆనేక సందర్భాల్లో రుజువైంది.

ప్ర: విభిన్న శాస్త్రాలతో భరతనాట్యాన్ని అనుసంధానం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

జ. మనపూర్వీకులు, గురువులు దూరదృష్టితో ఆలోచించి సమాజానికి అవసరమైన అనేక అంశాలను ప్రజల ముందుంచారు. అయితే వాటి అవసరం మేరకు వాడుకుంటున్నారే కానీ వాటి అంతరాల్లోకి వెళ్ళడం లేదు. భరతనాట్యం నేర్చుకోవడం ఓ స్టేటస్ సింబల్ అనో… పదిమందిలో గొప్పగా ప్రమోట్ కావాలనో నేర్చుకుంటున్నారే కాని దాని ఆంతరంగిక వ్యహారాన్ని విశ్లేషించడం లేదు. 45 ఏళ్ళ నా సుదీర్ఘ ప్రయాణంలో అనేకదేశాల వేదికపై ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు నాకెంతో గర్వంగా ఉండేది. భరతనాట్యంలో అనేక శాస్త్రాలు ఇమిడి ఉన్నాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఈ సారాన్ని నా విద్యార్థులకు నేర్పిస్తున్నాను.

ప్ర. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇచ్చిన మీ ప్రదర్శనలకు భాష సమస్య కాలేదా?

జ. భాష సమస్య కొంతమేరకు వచ్చినా అధిగమించాం. భరతనాట్యంలో ప్రధానంగా నృత్యప్రదర్శన పక్కవాద్యాలు, గాయకులు ఉంటారు. అయితే నాట్యబృందం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు నర్తకి భావయుక్తంగా భావాలను వ్యక్తీకరించడంతో ప్రేక్షకులకు సులువుగా అర్థం అవుతుంది. అయినా మా బృందానికి భాష సమస్య లేదు. భరతనాట్యాన్ని ఇంగ్లీషులోను ప్రదర్శించాం.

ప్రశ్న. 45 ఏళ్ళుగా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన మీకు నచ్చిన, ఇష్టమైన కళారూపాలు ఏవి?

జ.అహల్య, మేనక, గాంధారి పాత్రలంటే నాకు చాలా ఇష్టం. మహిళా సాధికారిత కోసం రూపొందించిన కళారూపాలు, కులమతభేదాలపై ప్రదర్శించన నృత్యాలు నాకు ఇష్టం.

ప్ర: నృత్యం ద్వారా ఆధ్యాత్మికం వైపు వెళ్లొచ్చా?

జ. నృత్యరూపకాల్లో ఆధ్యాత్మిక విలువలు అధికంగా ఉంటాయి. ప్రజలను ఆధ్యాత్మికత వైపు ప్రేరేపించే పవిత్ర ఆశయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదిశంకరాచార్యుల విరచిత సౌందర్యలహరి గణపతి సచ్చిదానంద మఠంలో ప్రదర్శించాను. నా నృత్యరూపకాలను తిలకించిన చినజియర్ స్వామి ప్రశంసించారు. నేను ప్రత్యేకంగా రూపొందించిన లలిత, విష్ణుసహస్రనామార్చనలు ప్రేక్షకులను భక్తిభావంతో, ఆధ్యాత్మిక మార్గాల్లో నడిపిస్తుందని ఆశిస్తున్నాను.

ప్ర: ఇప్పటి వరకు మీరు ప్రదర్శించిన రూపకాల వివరాలు?

జ.గీతోపదేశం,భజరేగోపాలం,నవదుర్గచరితం,శకుంతలప్రేమకావ్యం,సౌందర్యలహరి, హిందీలో కృష్ణదర్శనం,ఇంగ్లీషు లో మేనక బాలె, తమిళంలో పంచభూతక్షేత్రం,ఇంగ్లీషులో పీస్ ఆర్టు ప్రదర్శనలు ఇచ్చాను.

వి.భూమేశ్వర్
మనతెలంగాణ ప్రతినిధి

Comments

comments