Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

పోలవరమే… పెద్ద స్కామ్: జగన్

               jagan

ఆంధ్రప్రదేశ్: పోలవరంలో అవకతవకలు జరిగాయని, తాము శ్వేతపత్రం ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ… ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నా అంటున్న పవన్ రెండో మూడు రోజుల హడావిడి చేసి తరువాత కనిపించరని దుయ్యబట్టారు. పోలవరం బస్సు యాత్ర వైసిపి చేస్తుందనే భయంతోనే పవన్ ప్రాజెక్టు వద్దకు వచ్చారని విమర్శించారు. రాజకీయాల్లో అనుభవం ఉండాలని పవన్ అంటున్నారని… పిఆర్‌పి పెట్టిన సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ ఏం అనుభవం ఉందని కడిగిపారేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి జరిగిందంటున్న పవన్‌కు ఏం తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ పాలనలో అవినీతి జరిగితే అదే పార్టీలో ప్రజారాజ్యం పార్టీని ఎందుకు విలీనం చేశారని, ఆ విలీనంలో ఉన్న అవినీతి ఏంటని అడిగారు. అసలు పోలవరమే ఒక పెద్ద స్కామ్ అని దుయ్యబట్టారు.

Comments

comments