Search
Friday 20 April 2018
  • :
  • :

నిద్రావస్థలో మండల విద్యా వ్యవస్థ

  teacherనిద్రావస్థలో మండల విద్యా వ్యవస్థ, పట్టించుకోని అధికారులు
మన తెలంగాణ, ఏన్కూరుః
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లి పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్నారని గంగులనాచారం గ్రామస్థులు వివరించారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గంగులనాచారం ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు జాన్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తరగతి గదిలో సోమవారం విద్యార్థుల ఎదుట దర్జాగా నిద్రపోతున్న ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు సెల్‌లో ఫొటోలు తీసి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 40మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు పాఠశాల సమయంలో తరగతి గదిలో నిద్రపోతుంటే పాఠశాలలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిరోజు ఇలాగే కొనసాగుతుందని, విద్యార్థులు ఇళ్ళకు వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో గతంలో ఎన్నోసార్లు మండల విద్యాశాఖ అధికారికి తెలిపినా సదరు ప్రధానోపాధ్యాయుడి పనితీరు మారడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. సమయానికి బడికి రావడానికి వచ్చినా పాఠాలు చెప్పడం లేదని, గతంలో 80మంది విద్యార్థులకు గాను ప్రధానోపాధ్యాయుని పనితీరుతో ప్రస్తుతం 40మందికి తగ్గారని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

comments