Home తాజా వార్తలు 2018 ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల

2018 ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల

vrt
దుబాయ్: 2018 ఆసియా కప్ షెడ్యూల్‌ను ఐసిసి తాజాగా విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. కాగా యుఎఇ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేషియా, హాంగ్‌కాంగ్ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచులు నిర్వహించనున్నారు. ఇందులో గెలిచిన ఒక జట్టుకు టోర్నమెంట్‌లో అడే అవకాశం కల్పిస్తారు. ఇందులో గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్‌, క్వాలిఫయర్ జట్లు, గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ  దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.ఈ మెగా టోర్నీ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగతున్న సంగతి తెలిసిందే.
2018 ఆసియా కప్ షెడ్యూల్:
 
గ్రూప్ దశ:
15 సెప్టెంబర్- బంగ్లాదేశ్ vs శ్రీలంక (దుబాయ్)
16 సెప్టెంబర్- పాకిస్థాన్ vs క్వాలిఫయర్ (దుబాయ్)
17 సెప్టెంబర్- శ్రీలంక vs అఫ్గానిస్థాన్(అబు దాబి)
18 సెప్టెంబర్- ఇండియా vs క్వాలిఫయర్(దుబాయ్)
19 సెప్టెంబర్- ఇండియా vs పాకిస్థాన్(దుబాయ్)
20 సెప్టెంబర్ – బంగ్లాదేశ్ vs ఆఫ్గానిస్తాన్ (అబుదాబి)
సూపర్ ఫోర్:
21 సెప్టెంబర్-గ్రూప్ ఏ విన్నర్ vs గ్రూప్ బీ రన్నర్ (దుబాయ్)
21 సెప్టెంబర్-గ్రూప్ బీ విన్నర్ vs గ్రూప్ ఏ రన్నర్ (అబు దాబి)
23 సెప్టెంబర్-గ్రూప్ ఏ విన్నర్ vs గ్రూప్ ఏ రన్నర్ (దుబాయ్)
23 సెప్టెంబర్-గ్రూప్ బీ విన్నర్ vs గ్రూప్ బీ రన్నర్ (అబుదాబి)
25 సెప్టెంబర్-గ్రూప్ ఏ విన్నర్ vs గ్రూప్ బీ విన్నర్ (దుబాయ్)
26 సెప్టెంబర్-గ్రూప్ ఏ రన్నర్ vs గ్రూప్ బీ రన్నర్ (అబుదాబి)
 
ఫైనల్:
28 సెప్టెంబర్- ఆసియా కప్ 2018 ఫైనల్ (దుబాయ్)