Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

విజేతలు జొకొవిచ్, బెర్టెన్స్

2018 Novak Djokovic tennis season

సిన్సినాటి: ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెర్బియా యోధుడు నొ వాక్ జొకొవిచ్, నెదర్లాండ్స్ సంచలనం కికి బెర్టె న్స్ విజేతగా నిలిచారు. మహిళల ఫైనల్లో బెర్టెన్స్ టాప్ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో పదో సీడ్ జొకొవిచ్ అగ్రశ్రేణి ఆటగాడు, రెండో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచాడు. కింద టి సీజన్‌లో గాయాలతో సతమతమైన జొకొవిచ్ మళ్లీ గాడిలో పడ్డాడు. ఇటీవలే వింబుల్డన్ టైటిల్ గెలిచిన జొకొవిచ్ తాజాగా సిన్సినాటి ట్రోఫీతో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఫె దరర్‌తో జరిగిన ఫైనల్లో జొకొవిచ్ 64, 64 తే డాతో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన జొకొవిచ్ ఏ దశలోనూ ఫెదరర్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చూడచక్కని షాట్లతో అలరించిన జొకొవిచ్ లక్షం దిశగా అ డుగులు వేశాడు. తన మార్క్ షాట్లతో ఫెదరర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. జొకొవిచ్ కళ్లు చెదిరే షా ట్లతో విరుచుకు పడడంతో ఫెదరర్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే సమయంలో వరుస తప్పిదాల కు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మా ర్చుకోవడంలో సఫలమైన జొకొవిచ్ వరుసగా రెం డు సెట్లు గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. దీంతో రానున్న యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాడు.

Comments

comments