Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

క్రీడల్లో గెలుపోటములు సహజం

vollyషాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ముగిసిన 11వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

కొందుర్గు : క్రీడల్లో గెలుపు ఓటములు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొందుర్గు మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం రాత్రి ముగిసింది. ఈ పోటీల ముగింపు సమావేశానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా భావించాలని అన్నారు. ఓటమిని గెలుపునకు నాందిగా చేసుకోవాలని అన్నారు. క్రీడల వల్ల ప్రతి శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. కొందుర్గు మండల కేంద్రంలో పది సంవత్సరాల నుండి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం క్రీడలకు పెద్దపీట కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు అందె బాబయ్య, పి.శంకర్, అథ్లెట్ రవీందర్ యాదవ్, మదుసూధన్, సిఐ మదుసూధన్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఎఎస్సై రాంచంద్రయ్య, శ్రీధర్ రెడ్డి, రాజేష్ పటేల్, సున్నాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, రమేష్, గోపాల్, ప్రవీణ్, అసోసియోషన్ సభ్యులు విద్యాధర్, చెన్న, వీరయ్య, పాషా, బాస్కర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామ్ కళ్యాణ్, డడూల్ రాజు, డాక్య, ప్రవీణ్, సుభాష్, అమర్, గణేష్ పాల్గొన్నారు.
జిల్లా స్థాయి పోటీల్లో విజేతలు..
కొందుర్గు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో ఓపెన్ టూ ఆల్ విభాగంలో మొదటి బహుమతి 30వేలు సౌత్ సెంట్రల్ రైల్వే టీం, ద్వితీయ బహుమతి 15 వేలు రాజాపూర్ ఆర్మీ టీం, తృతీయ బహుమతి 5వేలు హైదరరాబాద్ జంపన్న టీం సభ్యులు నిలువగా రూరల్ విభాగంలో 10 వేలు మొదటి బహుమతి వికారాబాద్ టీం, రెండవ బహుమతి షాద్‌నగర్ టీం 5వేలు, మూడవ బహుమతి కుల్కచర్ల 3వేలు గెలుపొందారు. ఈ సందర్బంగా విజేతలకు నిర్వాహకులు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు అందె బాబయ్యలు, నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

comments