Search
Saturday 21 April 2018
  • :
  • :

వ్యవసాయాన్ని బతికించుకునేందుకే 24గంటల కరెంటు

ph3

సూర్యాపేట: వ్యవసాయాన్ని బతికించుకునేందుకే ప్రభుత్వం 24గంటల ఉచిత కరెంటును అందిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సూ ర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వ ద్ద రూ.5కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మా ట్లాడారు. వ్యవసాయాన్ని భారంగా భావించిన రై తులకు పండుగలా మార్చడమే లక్షమని ఆయన వివరించారు. రాష్ట్రంలో 55 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొ న్నారు. రైతులకు సాగు నీరందించేందుకు ప్రభు త్వం ప్రాజెక్టులు కట్టడానికి ప్రణాళిక రచిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేశాయని విమర్శిం చారు. ఎవరెన్నీ చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజరవర్గంలోనే రైతులు జనరేటర్ల సహాయంతో వ్యవసాయం చేసిన సంగతి తెలియ దా అని ప్రశ్నించారు. దేశంలోనే 24 గంటల వి ద్యుత్‌ను అందించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయ ని ర్మాణంతో పాటు అంతర్గత రోడ్లను పూర్తి చేస్తామ ని చెప్పారు. అనంతరం హమాలి కార్మికులకు దుస్తుల పంపిణీ చేశారు. మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందిన హమాలీ నూలిమేక ల శ్రీనివాస్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ నా యకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments