Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఇస్రో సెంచరీకం

isro

కార్టోశాట్ సహా 31 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన పిఎస్‌ఎల్‌వి – సి40
సొంత ఉపగ్రహాల లెక్కలో వంద పూర్తి చేసుకున్న ఘనత

శ్రీహరికోట: ఇస్రో చేపట్టిన పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విజ యవంతమైంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 31 ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశించాయి. మూడు స్వదేశీ ఉపగ్రహాలు, 28 విదేశీ ఉపగ్రహాలను ఒకే సారి ప్రయో గించడం ద్వారా ఇస్రో తన సత్తా మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ ప్రయోగంలో కార్టోశాట్ 2 ఉపగ్రహం భార త్‌కు ఎంతో కీలకమైనది. అదే విధంగా ప్రయోగంలో చివ రిసారిగా నింగికెగసిన మైక్రోశాటిలైట్ ఇస్రో ప్రయోగిం చిన 100వ ఉపగ్రహం కావడం విశేషం. ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ ఈ ప్రయోగం విజయవంతంగా ముగియడంతో ఎంతో ఉపశమనం పొందారు. ఇస్రో చైర్మన్‌గా ఆయనకు ఇదే చివరి మిషన్. కొత్త సంవత్సరా న్ని విజయవంతంగా ప్రారంభించామని, కార్టోశాట్ 2 ప్రయోగం దేశ ప్రజలకు కొత్త సంవత్సరపు కానుక అని ఆయన అభివర్ణించారు. కార్టోశాట్ పని తీరు ఇప్పటి వర కు సంతృప్తికరంగా ఉందని ఆయన తెలిపారు. అత్యాధు నిక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అయిన కార్టోశాట్ స మాచార సేవలను మరింత విస్తృతం చేయనుందని ఆయ న తెలిపారు. గత సారి చేసిన పిఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయో గం విఫలం చెందడంతో ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయోగం చేశామని ఆయన వివరించారు.
2 గంటల 15 నిమిషాల ప్రయోగం: ఇస్రో చేపట్టిన ప్రయోగాలన్నింటిలోనూ పిఎస్‌ఎల్‌వి-సి 40 ప్రయోగం సుదీర్ఘమైనది. 31 ఉపగ్రహాల ప్రయోగానికి మొత్తం 2 గంటల 15 నిమిషాల సమయం పట్టింది. నాలుగు దశ ల్లో జరిగిన ప్రయోగంలో మొదట 710 కిలోల కార్టోశా ట్ 2ను ప్రయోగించారు. ప్రయోగించిన 17 నిమిషాల్లో 505 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రోన స్ ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత భారత్‌కు చెం దిన నానోశాటిలైట్‌తో పాటు ఆరు దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను 7 నిమిషాల వ్యవధిలో ఒక దాని తర్వాత ఒకటి ప్రయోగించారు. చివరిగా భారతదేశానికి చెందిన మైక్రో శాటిలైట్‌ను ప్రయోగించారు. పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో 359.584 కిలోమీటర్లకు పిఎస్ ఎల్‌వి -సి40 ను తీసుకువచ్చిన తర్వాత మైక్రో శాటిలైట్ ప్రయోగం జరిగింది. 28 విదేశీ ఉపగ్రహాల్లో 3 మైక్రో ఉప గ్రహాలు కాగా 25 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కెనడా, ఫ్రాన్స్, కొరియా, యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా దేశాలకు చెందిన ఉపగ్రహాలు. పిఎస్‌ఎల్‌వి-సి40 మిషన్ విజయవంతం కావడంతో ప్రధా ని నరేంద్రమోడీ శాస్త్రవేత్తలకు ట్విట్టర్ ద్వారా శుభాకాం క్షలు తెలిపారు.

Comments

comments