Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

మేడారానికి 4,200 ప్రత్యేక బస్సులు

Medaram-jathara

హైదరాబాద్, వరంగల్ నుంచి ఎసి సర్వీస్‌లు ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ

మన తెలంగాణ/ వరంగల్‌బ్యూరో : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులను చేరవేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా 4200 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌టిసి చైర్మన్ సోమావరపు సత్యనారాయణ తెలిపారు. బుధవారం వరంగల్‌లో మేడారం ఏర్పాట్లపై ఆర్‌టిసి రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3వరకు జరిగే జాతరకు ఆర్‌టిసి నుంచి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్‌టిసి లక్షమన్నారు. ఇందు కోసం 4,200 బస్సులను నడుపుతున్నామని, ఇందులోవరంగల్ రీజియన్ నుంచి 2,150 బస్సులు, కరీంనగర్ రీజియన్ నుంచి 520 బస్సులు, ఖమ్మం రీజియన్ నుంచి 380 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ నుంచి 250 బస్సులు, ఆదిలాబాద్ నుంచి 300, రంగారెడ్డి నుంచి 100, మెదక్ నుంచి 50 బస్సులతోపాటు మరో రెండు వందల బస్సులను వరంగల్, హైదరాబాద్ నుంచి ఏసి బస్సులతోపాటు ఇతర బస్సులను నడుపనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదాలను నివారించేందు కోసం 20 మొబైల్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాలలో వచ్చే భక్తులను నార్లాపూర్ పార్కింగ్ నుంచి మేడారం వరకు ఆర్‌టిసి ద్వారా భక్తులను ఉచితంగా చేస్తామన్నారు. జాతర మొత్తం ఆర్‌టిసి డ్రైవర్, కండక్టర్, మెకానిక్ మొదలుకొని ఆర్‌ఎం స్థాయి వరకు మొత్తం 12వేల మం ది సిబ్బంది, అధికారులు జాతర కోసం విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఈసారి జాతరకు ప్రత్యేకం గా వజ్ర బస్సులను నడుపుతున్నామని, వీటితోపాటు వ రంగల్, హైదరాబాద్ నుంచి ఎసి బస్సులను కూడా నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సత్యనారాయణ తెలిపా రు. ఈ సమావేశంలో ఆర్‌టిసి విసి అండ్ ఎండి జెడి రమణారావు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి వెంకట్రా వు, ఇడి గరిమిళ్ల సత్యనారాయణ, ఆపరేషన్ వింగ్ వేణు, వరంగల్ రీజియన్ ఆర్‌ఎం సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను సత్యనారాయణ విడుదల చేశారు.

Comments

comments