Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

చెరువులో పడిన బస్సు: ఏడుగురి మృతి

Ten Members Injured in Toofan Collident Maruti van

బెంగళూరు: కర్నాటకలోని హసన్ జిల్లా కరేకరే ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు- మంగుళూరు జాతీయ రహదారి లో బస్సు చెరువులో పడి ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం హసన్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments