Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

పారిస్‌లో భారీ దోపిడీ

PARIS

ఫ్రాన్స్ : పారిస్‌లో బుధవారం సాయంత్రం భారీ దోపిడీ జరిగింది. రూ.30 కోట్ల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు. పారిస్‌లోని ఫ్లేస్ వెండోమ్‌లో ఉన్న ప్రసిద్ధ రిట్జ్ హోటల్‌లో బంగారు నగల ప్రదర్శన నిర్వహించారు. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో హోటల్‌లోకి చొరబడి అక్కడ ఉన్న వారిని బెదిరించి బంగారు నగలను అపహరించారు. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు దుండగులను అడ్డుకున్నారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నగలతో పరారీ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

A huge exploitation in Paris

Comments

comments