Search
Monday 23 April 2018
  • :
  • :

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

murder
మనతెలంగాణ/బోధన్: పట్టణంలోని రాకాసి పేటలో భర్త చేతిలో భార్య హత్యకు గురైన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం రాకాసి పేటకు చెందినలక్ష్మి 45 మహిళను భర్త రాములు కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. గత కొంత కాలంనుండి భార్య పై అనుమానం పెంచుకుని తరచు వేదించే వాడని సోమవారం సైతం ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఇంట్లో కర్రతో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు లక్ష్మణ్ గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించడంతో మృత దేహాన్ని పరిశీలించి ఒంటి పై ఉన్న గాయాలతో పాటు తలకు బలమైన గాయమవ్వడంతో హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. భర్త రాములుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్టు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Comments

comments