Search
Saturday 21 April 2018
  • :
  • :

ట్రాక్టర్, మోటర్ సైకిల్ ఢీ…ఒకరి మృతి

accident2

మన తెలంగాణ / గుడిహత్నూర్‌ః గుడిహత్నూర్ మండలం తోషం గ్రామపంచాయతీ పరిధిలోని పూనగూడ గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం మోటర్‌సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో  వ్యక్తి మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై కిరణ్ కుమార్ కథనం ప్రకారం కుంరంభీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామానికి చెందిన పెందూర్ తుకారాం(38) తన బందువైన వంశీతో కలిసి ఆదిలాబాద్‌కు వెళ్లి పనులు ముగించుకుని మోటర్ సైకిల్‌పై ఉట్నూర్‌కు వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో పెందూర్ తుకారాం సంఘటన స్థలంలోనే మృతి చెందగా వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో మృతున్ని గుర్తించడంలో జాప్యం జరగగా గురువారం గుర్తించిన పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

comments