Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఓ రేటు!(‘అభిమన్యుడు’ టీజర్)

Vishal-and-Samantha

హైదరాబాద్: విశాల్‌ హీరోగా నటించిన తమిళం చిత్రం ‘ఇరుంబుతిరై’. దీన్ని తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. శుక్రవారం ‘అభిమన్యుడు’  టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ లో సీనియర్‌ నటుడు అర్జున్‌ ‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు.. నీ గురించి చిన్న సమాచారం చాలు.. దిస్‌ ఈజ్‌ ద ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌.. ఇక్కడ ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఓ రేటుంది. ప్రతి ఒక్కరి కంప్యూటర్‌ స్క్రీన్‌ వెనుక ఓ ఇనుప కవచం ఉంది. దాన్ని ఎవరూ తాకలేరు,  తెరవనూ లేరు’ అని పలికిన డైలాగ్ బాగుంది. ఈ మూవీలో అర్జున్‌ ప్రతినాయకుడిని పోలిన పాత్రను పోషించారని తెలుస్తోంది. పిఎస్‌. మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘అభిమన్యుడు’లో సమంత కథనాయికగా నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన తమిళ టీజర్ కు భారీ వ్యూస్ వచ్చాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘అభిమన్యుడు’ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Comments

comments